సంజయ్‌ మంజ్రేకర్‌పై నెటిజన్ల ట్రోల్‌

అంబటి రాయుడు, పియూష్‌ చావ్లా లోప్రొఫైల్‌ క్రికెటర్లు అన్నందుకు భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు, వ్యా‌ఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌పై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. అబుదాబిలో శనివారం ప్రారంభమైన టీ20 మెగా ఈవెంట్లో చెన్నై,

Updated : 21 Sep 2020 08:43 IST

రాయుడు, చావ్లా లోప్రొఫైల్‌ క్రికెటర్లు అన్నందుకు.. 

దిల్లీ: అంబటి రాయుడు, పియూష్‌ చావ్లా లోప్రొఫైల్‌ క్రికెటర్లు అన్నందుకు భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు, వ్యా‌ఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌పై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. అబుదాబిలో శనివారం ప్రారంభమైన టీ20 మెగా ఈవెంట్లో చెన్నై, ముంబయి జట్లు తలపడ్డాయి. ముంబయి నిర్దేశించిన 163 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై జట్టు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్‌, రాయుడు జట్టును విజయతీరాల వైపు నడిపించారు. చాలా రోజుల విరామం తర్వాత బ్యాట్‌ పట్టిన అంబటి రాయుడు 48 బంతుల్లో 71 పరుగులు చేసి చెన్నై గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు చెన్నై తరఫున బౌలింగ్ చేసిన చావ్లా నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశారు. 

వీరిరువురి ప్రదర్శనపై మంజ్రేకర్‌ ట్వీట్‌ చేశారు. లోప్రొఫైల్‌ క్రికెటర్లు అయిన రాయుడు, చావ్లా మ్యాచ్‌లో అద్భుతంగా రాణించడం సంతోషంగా ఉందని ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు మంజ్రేకర్‌కు చురకలు అంటించారు. భారత్‌ తరఫున 50కి పైగా వన్డే మ్యాచులు ఆడిన రాయుడు.. రెండుసార్లు ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన చావ్లా లోప్రొఫైల్‌ క్రికెటర్లు కాదని కొందరు.. మంజ్రేకర్‌ తన భాషను మార్చుకోవాలని మరికొందరు పేర్కొన్నారు. గతంలోనూ రవీంద్ర జడేజా ప్రదర్శనపై మంజ్రేకర్‌ చేసిన ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని