Siraj-Anand Mahindra: సిరాజ్‌కూ ఓ ఎస్‌యూవీ ఇవ్వండి..! నెటిజన్ రిక్వెస్ట్‌కు ఆనంద్ మహీంద్రా రిప్లై ఇదే..
ఇప్పుడందరి నోట సిరాజ్ (Siraj) పేరే. ఆసియా కప్ ఫైనల్‌లో (Asia Cup 2023 Final) తన అద్భుతమైన బౌలింగ్‌తో విరుచుకుపడ్డాడు. స్వింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై శ్రీలంకను కుప్పకూల్చాడు. అతడిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్‌లో (Asia Cup 2023) శ్రీలంకపై ఆరు వికెట్లతో విరుచుకుపడిన భారత పేసర్ సిరాజ్ పేరు మారుమోగిపోతోంది. అంతేకాకుండా, తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డును కూడా కొలంబో గ్రౌండ్ సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు నెటిజన్ల నుంచి ఓ విజ్ఞప్తి అందింది. ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. సిరాజ్ ప్రదర్శనపై ట్విటర్ వేదికగా (ప్రస్తుతం ఎక్స్) ఆనంద్ మహీంద్రా అభినందనలు కురిపించారు.
‘‘మన ప్రత్యర్థుల కోసం ఇంతకుముందెన్నడూ నా హృదయం బాధపడలేదు. కానీ, ఇప్పుడు వారిపై ఏదో అద్భుతమైన శక్తి ప్రయోగించినట్లుగా అనిపించింది. మహమ్మద్ సిరాజ్ నువ్వొక మార్వెల్ అవెంజర్‌వి’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దానిని రీట్వీట్ చేస్తూ ఓ అభిమాని.. ‘‘సర్, సిరాజ్‌కు ఓ ఎస్‌యూవీ ఇవ్వండి’’ అని రిక్వెస్ట్ పెట్టాడు. గతంలోనే ఇచ్చినట్లు మహీంద్రా బదులిచ్చారు. 2021లోనే సిరాజ్‌కు ఓ ‘థార్’ను ఆనంద్ మహీంద్రా బహూకరించారు. ఆసీస్‌తో టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత సిరాజ్‌కు ఆ కారును బహుమతిగా ఇచ్చారు.
కొలంబో క్రికెట్ గ్రౌండ్ సిబ్బంది కోసం తన రివార్డును సిరాజ్ ప్రకటించడంపైనా ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘‘సిరాజ్ నిర్ణయంపై ఒకే ఒక్క మాట చెబుదామనుకుంటున్నా. అదేంటంటే ‘క్లాస్’. ఇదేమీ మీ సంపద లేదా మీ నేపథ్యం నుంచి వచ్చేది కాదు. మీలో ఉంటేనే అది బయటకు కనిపిస్తుంది’’ అని ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Culture Festival: ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే