PAK vs BAN: బంగ్లాదేశ్‌ ఆలౌట్‌.. పాక్‌ లక్ష్యం 205

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 45.1 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్‌ 204 పరుగులకు ఆలౌటయ్యింది.

Published : 31 Oct 2023 17:54 IST

కోల్‌కతా: ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన పాకిస్థాన్‌.. ఇవాళ బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. కోల్‌కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. లిట్టన్ దాస్‌ (45; 64 బంతుల్లో 6 ఫోర్లు), మహ్మదుల్లా (56; 79 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), షకీబ్ అల్ హసన్ (43; 64 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. మెహది హసన్ మిరాజ్ (25) పరుగులు చేశాడు. తాంజిద్ హసన్ (0), నజ్ముల్ హొస్సేన్ శాంటో (4), ముష్పీకర్ రహీమ్ (5), తౌహిద్‌ హృదౌయ్‌ (7), ముఫ్తికర్‌ రెహ్మాన్‌ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. పాక్‌ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహ్మద్‌ వసీమ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. హారిస్ రవూఫ్‌ 2, ఉసామా మీర్, ఇఫ్తికార్ అహ్మద్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని