Asia Cup 2023: తొలుత బ్యాట్‌తో.. తర్వాత బంతితో.. అఫ్గాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌

ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌ను బంగ్లాదేశ్‌ 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత 334 పరుగుల భారీ స్కోర్‌ చేసిన బంగ్లా ఆతర్వాత అఫ్గాన్‌ను 245 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 

Updated : 03 Sep 2023 23:50 IST

లాహోర్‌: ఆసియా కప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో చెలరేగిన బంగ్లా ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అఫ్గాన్‌ను చిత్తు చేసింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మెహిది హసన్‌ మిరాజ్‌(112: 119 బంతుల్లో 3 సిక్స్‌లు, 7 ఫోర్లు), శాంటో(104: 105 బంతుల్లో 2 సిక్స్‌లు, 9 ఫోర్లు) చెలరేగి ఆడారు. అనంతరం 335 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 44.3 ఓవర్లలోనే 245 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో బంగ్లా 89 పరుగుల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తాస్కిన్‌ అహ్మద్‌ 4, శౌరీఫుల్‌ ఇస్లాం 3, హసన్‌ మహ్మద్‌, మెహిది హసన్‌ మిరాజ్‌ తలో వికెట్‌ తీశారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని