Bangladesh vs Sri Lanka: అసలంక శతకం.. బంగ్లాదేశ్‌ లక్ష్యం 280

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 279 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Updated : 06 Nov 2023 18:10 IST

దిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భాగంగా బంగ్లాదేశ్‌ (Bangladesh) ముందు శ్రీలంక 280 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చరిత్‌ అసలంక (108; 105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో రాణించగా లంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్‌ అయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు ఆరంభంలోనే కుశాల్‌ పెరీరా (4) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కుశాల్‌ మెండిస్‌ (19)తో కలిసి ఓపెనర్‌ నిశంక ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నిశంక (41) కూడా ఔట్‌ కావడంతో సమర విక్రమ (41), అసలంక కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు.

ఈ క్రమంలో అర్ధశతకానికి దగ్గరవుతున్న సమర విక్రమ ఔటయ్యాడు. ఏంజిలో మాథ్యూస్‌ (0) ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే ‘టైమ్‌డ్‌ ఔట్‌ (timed out)’గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో కొద్దిసేపు మైదానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం వచ్చిన ధనంజయ డిసిల్వా (34) అసలంకకు సహకారం అందించాడు. ఈ క్రమంలో వన్డేల్లో శతకం పూర్తి చేసుకున్న అసలంక కొద్దిసేపటికే తంజీమ్‌ బౌలింగ్‌లో లిటన్‌ దాస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక మిగిలిన శ్రీలంక బ్యాటర్లు తీక్షణ (22), రజిత (0), చమీర (4), మధుశనక (0*) పెద్దగా మెరుపులేమీ మెరిపించలేదు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తంజీమ్‌ మూడు వికెట్లు తీయగా... షోరిఫుల్‌ ఇస్లామ్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. మెహిదీ హసన్‌ మిరాజ్‌కు ఒక వికెట్‌ దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని