CWG 2022: చరిత్ర సృష్టించిన భవినా పటేల్

కామన్వెల్త్‌ పోటీల్లో భారత పారా టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినా పటేల్‌ చరిత్ర సృష్టించింది. పారా టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకుంది..

Published : 07 Aug 2022 08:05 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ పోటీల్లో భారత పారా టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవినా పటేల్‌ చరిత్ర సృష్టించింది. పారా టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకుంది. గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా.. ఫైనల్స్‌లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో గెలుపొందింది.

దీంతో టీటీ విభాగంలో భారత తరఫున గోల్డ్‌ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. పోటీల్లో అంతకముందు మరో పారా టీటీ ప్లేయర్‌ సోనాల్‌బెన్‌ మనూబాయి పటేల్‌ కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో కామన్వెల్త్‌లో భారత పతకాల సంఖ్య 40కి చేరింది. వీటిలో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని