jasprit bumrah: ప్రపంచకప్‌నకు దూరం.. స్పందించిన బుమ్రా!

ఆసీస్‌తో టీ20 సిరీస్‌ మధ్యలోనే నిష్క్రమించిన ఈ ఫాస్ట్‌ బౌలర్‌.. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. తాజాగా ప్రపంచకప్‌ నుంచి వైదొలగడంపై బుమ్రా స్పందించాడు.

Published : 04 Oct 2022 17:47 IST

దిల్లీ: టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వెన్ను గాయం కారణంగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ మధ్యలోనే నిష్క్రమించిన ఈ ఫాస్ట్‌ బౌలర్‌.. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. తాజాగా ఈ అంశంపై బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌కు దూరమైనా తానింకా ధైర్యంగానే ఉన్నానని తెలిపాడు. త్వరలోనే గాయం నుంచి కోలుకుని జట్టుకు మద్దతుగా నిలుస్తాని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

‘‘ఈసారి టీ20 ప్రపంచకప్‌లో భాగం కాలేకపోతున్నా.. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. నేను కోలుకోవాలని కోరుకుంటూ మద్దతుగా నిలిచిన నా ఆత్మీయులందరికీ ధన్యవాదాలు. గాయం నుంచి త్వరలోనే కోలుకుని నా జట్టును ఉత్సాహపరుస్తా’’ అంటూ ట్విటర్‌ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే బుమ్రా స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని