Rohit Sharma: చెన్నైతో మ్యాచ్‌.. రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు

దూకుడుకు మారుపేరుగా నిలిచే ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది.

Published : 06 May 2023 18:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ చరిత్రలో (IPL) ముంబయి ఇండియన్స్‌ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన ఖాతాలో మాత్రం చెత్త రికార్డును వేసుకున్నాడు. ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో చెపాక్‌ వేదికగా చెన్నైతో  జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ మూడో బంతికే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ల్యాప్‌ షాట్‌ను ఆడేందుకు ప్రయత్నించి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న జడేజా చేతికి చిక్కాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 16వ సారి డకౌట్‌ అయ్యాడు. దీంతో అత్యధికసార్లు డకౌట్‌ అయిన బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు.  

ఈ మ్యాచ్‌ ముందు వరకు దినేశ్ కార్తిక్‌, మన్‌దీప్‌ సింగ్, సునీల్‌ నరైన్‌తో కలిసి రోహిత్ శర్మ 15 డకౌట్లతో సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ చెన్నై మ్యాచ్‌లోనూ పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరడంతో అతడి డకౌట్ల సంఖ్య 16కి చేరింది. వీరందరి తర్వాత సీఎస్‌కే ఆటగాడు అంబటి రాయుడు 14 డకౌట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని