మోదీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్‌ గేల్

కరేబియన్‌ దీవుల్లోని పలు దేశాలకు కరోనా టీకా అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ కృతజ్ఞతలు తెలిపాడు. తమ దేశానికి ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్లు సరఫరా........

Updated : 19 Mar 2021 17:53 IST

కింగ్‌స్టన్‌: కరేబియన్‌ దీవుల్లోని పలు దేశాలకు కరోనా టీకా అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ కృతజ్ఞతలు తెలిపాడు. తమ దేశానికి ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్లు సరఫరా చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఆ వీడియోను జమైకాలోని భారత హై కమిషన్‌ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. భారత హై కమిషనర్‌ ఆర్‌.మసాకుయ్‌ను కలిసిన గేల్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ ఫొటోలను షేర్‌ చేశాడు. ‘వ్యాక్సిన్‌ మైత్రి’ పేరిట కొవిడ్‌ టీకాలను భారత్‌ పలు దేశాలకు సరఫరా చేస్తోంది. ఇటీవలే కరేబియన్‌ ప్రాంతాలైన ఆంటిగ్వా, బార్బుడా, జమైకాకు టీకా డోసులను పంపిణీ చేసింది. 

ఆండ్రూ రస్సెల్‌ కూడా ప్రధాని మోదీకి బుధవారం కృతజ్ఞతలు తెలిపాడు. ‘ప్రధాని మోదీ, భారత హై కమిషన్‌కు చాలా చాలా ధన్యవాదాలు. మాకు వ్యాక్సిన్లు అందాయి. భారత దాతృత్వాన్ని జమైకా ప్రజలు అభినందిస్తున్నారు. ప్రపంచం సాధారణ స్థితికి వస్తే చూడాలని ఆతృతతో ఉన్నా’ అని రస్సెల్‌ ఓ వీడియోలో పేర్కొనగా జమైకాలోని భారత కార్యాలయం దానిని ట్విటర్‌లో పోస్టు చేసింది. విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ సహా పలువురు విండీస్‌ మాజీలు సైతం భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని