Deepti Sharma: ఐసీసీ టీ20 ఉత్తమ మహిళా బౌలర్‌.. రెండో స్థానంలో దీప్తిశర్మ

 టీ20 ఉత్తమ మహిళా బౌలర్ల ర్యాంకులను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో భారత ఆఫ్‌ స్పిన్నర్ దీప్తిశర్మ రెండో స్థానానికి చేరుకుంది.

Published : 31 Jan 2023 20:33 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌:  టీ20 ఉత్తమ మహిళా బౌలర్ల ర్యాంకులను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో భారత ఆఫ్‌ స్పిన్నర్‌ దీప్తిశర్మ రెండు స్థానాలను మెరుగుపరుచుకొని రెండో స్థానానికి ఎగబాకింది. స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ నాలుగు స్థానాలు మెరుగుపడి 14వ స్థానానికి చేరుకుంది. రేణుకా సింగ్‌, స్నేహ్‌ రానా చెరో స్థానాన్ని కోల్పోయి 7, 11 స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్‌ క్రీడాకారిణి సోఫీ ఎక్లెస్టోన్‌ 763 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోఫీకి దీప్తికి మధ్య 26 పాయింట్ల తేడా ఉంది. దీప్తి తన ఫామ్‌ని కొనసాగిస్తే అగ్రస్థానానికి చేరుకోగలదు.

ప్రస్తుతం భారత్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ మధ్య ముక్కోణపు టీ20 సిరీస్‌ జరుగుతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో దీప్తిశర్మ అద్భుతంగా బౌలింగ్ చేస్తోంది. మూడు మ్యాచులు ఆడి 8 వికెట్లు పడగొట్టింది. దీంతో ఆమె 737 పాయింట్లు సాధించి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచులు ఆడిన భారత్‌ మూడింట్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. సిరీస్‌ విజేతను తేల్చే ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌ - దక్షిణాఫ్రికా మధ్య ఫిబ్రవరి 2న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని