DC vs RR: సంజూ రాణించినా.. రాజస్థాన్‌కు ఓటమి

దిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ అదరగొట్టింది. అబుదాబి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

Updated : 25 Sep 2021 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ అదరగొట్టింది. అబుదాబి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్‌కి దాదాపుగా చేరింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్ ‌(43; 32 బంతుల్లో 1×4, 2×6), షిమ్రన్‌ హెట్‌మైర్‌ (28; 16 బంతుల్లో 5×4) రాణించారు. లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్‌.. 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ ఆటగాళ్లలో కెప్టెన్‌ సంజూ శాంసన్‌(70; 53 బంతుల్లో 8×4, 1×6)  ఒక్కడే రాణించగా.. మహిపాల్‌ లోమ్రోర్‌(19) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరునూ చేయలేకపోయారు. 

విఫలమైన రాజస్థాన్ టాప్‌ ఆర్డర్‌

156 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. అవేశ్‌ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో చివరి బంతికి ఓపెనర్ లివింగ్‌ స్టన్‌(1) ఔటవ్వగా..నోర్జె వేసిన తర్వాతి ఓవర్‌లో యశస్వీ జైస్వాల్‌(5) పెవిలియన్‌ చేరాడు.డేవిడ్ మిల్లర్‌(7) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇతడు అశ్విన్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. మహిపాల్‌(19), రియాన్ పరాగ్(2), తెవాతియా కూడా తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దిల్లీ బౌలర్లలో అవేశ్‌ఖాన్‌, రవిచంద్రన్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, రబాడ, నోర్జె తలో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని