కోహ్లి లక్షణాలు నాలో రావాలి : పడిక్కల్‌

ఆట పట్ల టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంకితభావం, సత్తాచాటాలన్న పట్టుదల తనలో ఉండాలని కోరుకుంటున్నట్లు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ అన్నాడు...

Published : 06 Apr 2021 08:10 IST

బెంగళూరు: ఆట పట్ల టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంకితభావం, సత్తాచాటాలన్న పట్టుదల తనలో ఉండాలని కోరుకుంటున్నట్లు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ అన్నాడు. నిరుడు ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున రాణించిన పడిక్కల్‌ ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, విజయ్‌ హజారె వన్డే టోర్నీలో మెరిశాడు. విజయ్‌ హజారెలో 7 మ్యాచ్‌ల్లో 147.40 సగటుతో 737 పరుగులు రాబట్టాడు. వరుసగా 4 శతకాలు, 3 అర్ధ సెంచరీలు సాధించాడు. ‘‘బ్యాటింగ్‌లో చాలా పరిణతి సాధించా. ఇన్నింగ్స్‌ను నిర్మించడం.. భారీగా పరుగులు రాబట్టడం నేర్చుకున్నా. నిరుడు బెంగళూరు తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. విరాట్, డివిలియర్స్‌లతో కలిసి ఆడటం గొప్ప గౌరవం. కోహ్లి, డివిలియర్స్‌ల నుంచి ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకున్నా. ఆట పట్ల కోహ్లి అంకితభావం, సత్తాచాటాలన్న పట్టుదల అద్భుతం. అతనికి స్ఫూర్తినివ్వడానికి మరొకరు అవసరం లేదు. కోహ్లీలో సత్తాచాటాలన్న విజయేచ్ఛకు కొదవలేదు. దేశం, జట్టు తరఫున అత్యుత్తమంగా ఆడాలనుకుంటాడు. ఈ లక్షాణాలన్నీ నాలో ఉండాలని కోరుకుంటున్నా’’ పడిక్కల్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని