ENG vs BAN: కొండంత లక్ష్యం.. సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభ పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన ఇంగ్లాండ్.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ విజయంపై కన్నేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Updated : 10 Oct 2023 17:12 IST

ధర్మశాల: ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభ పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన ఇంగ్లాండ్.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ విజయంపై కన్నేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ తడబడుతోంది. 27 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. టాపార్డర్‌లో లిట్టన్ దాస్‌ (76; 66 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ముష్ఫీకర్ రహీమ్‌ (45*) అర్ధ శతకానికి చేరువ కాగా..  తౌహీద్‌ హృదయ్‌ (8*) క్రీజులో ఉన్నాడు. 

ఇంగ్లాండ్ పేసర్‌ రీస్ టాప్లీ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో తాంజిద్ హసన్ (1), నజ్ముల్ హొస్సేన్ శాంటో (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపి బంగ్లాకు గట్టి షాక్ ఇచ్చాడు. టాప్లీ కొద్దిసేపటికి షకీబ్ అల్‌ హసన్ (1)ని కూడా ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్‌ (8)ని క్రిస్‌ వోక్స్‌ వెనక్కి పంపాడు. దీంతో 49/4 స్కోరుతో బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ముష్పీకర్ రహీమ్‌, లిట్టన్ దాస్‌ నిలకడగా ఆడి ఐదో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రిస్‌వోక్స్‌ బౌలింగ్‌లో దాస్‌.. వికెట్ కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో బంగ్లా ఐదో వికెట్ కోల్పోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని