సూర్య ‘ఫైర్‌’: ఇంగ్లాండ్‌ లక్ష్యం 186

నాలుగో టీ20లో టీమ్‌ఇండియా రెచ్చిపోయింది. సిరీస్‌లో తొలిసారి భారీ స్కోరు సాధించింది. 8 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్‌కు 186 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 31 బంతుల్లో 6×4, 3×6) భీకరమైన షాట్లతో ఆంగ్లేయులను వణికించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోన..

Published : 18 Mar 2021 21:09 IST

ఆఖర్లో శ్రేయస్ మెరుపులు

అహ్మదాబాద్‌: నాలుగో టీ20లో టీమ్‌ఇండియా రెచ్చిపోయింది. సిరీస్‌లో తొలిసారి భారీ స్కోరు సాధించింది. 8 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్‌కు 186 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 31 బంతుల్లో 6×4, 3×6) భీకరమైన షాట్లతో ఆంగ్లేయులను వణికించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే అర్ధశతకం అందుకున్నాడు. కేవలం 28 బంతుల్లోనే లాంఛనం పూర్తి చేసుకున్నాడు.

విధ్వంసకరంగా ఆడిన సూర్య రెండో వికెట్‌కు రాహుల్‌ (12)తో కలిసి 42, ఐదో వికెట్‌కు పంత్‌ (30; 23 బంతుల్లో 4×4)తో కలిసి 40 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వికెట్లు పడకుండా పంత్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. జోరు పెంచే క్రమంలో ఔటయ్యాడు. ఆఖర్లో శ్రేయస్‌ అయ్యర్‌ (37; 18 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు మెరిపించాడు. జోఫ్రా ఆర్చర్‌ 4 వికెట్లు తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని