Kuldeep: కుల్‌దీప్‌ ‘2.0’.. ఏం చేశావని రవిశాస్త్రి నన్ను అడిగారు: సునీల్ జోషి

జట్టులో అవకాశం వస్తే నిరూపించుకోవడానికి భారత ఆటగాళ్లు (Team India) నిరంతరం ఎదురుచూస్తుంటారు. తాజాగా విండీస్‌ పర్యటనలోని (WI vs IND) వన్డే సిరీస్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ అదరగొట్టేశాడు.

Updated : 04 Aug 2023 11:04 IST

ఇంటర్నెట్ డెస్క్: చాలా రోజుల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన  కుల్‌దీప్ యాదవ్‌ (Kuldeep Yadav) వెస్టిండీస్‌ పర్యటనలో తన సత్తా చాటాడు. వన్డే సిరీస్‌లో (WI vs IND) మూడు మ్యాచుల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. అలాగే తాజాగా ప్రారంభమైన ఐదు టీ20ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనూ ఒక వికెట్ తీశాడు. గత కొంతకాలంగా వికెట్లను పడగొట్టడంలో విఫలమైన కుల్‌దీప్‌ ఇప్పుడు సరికొత్తగా తన అస్త్రాలను సిద్ధం చేసుకుని మరీ బరిలోకి దిగాడు. కుల్‌దీప్‌ 2.0 ప్రదర్శన వెనుక మాజీ సెలెక్టర్‌, భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ సునీల్ జోషి కృషి ఎంతో ఉంది. జట్టులో నుంచి కుల్‌దీప్‌ను పక్కకు తప్పించినప్పుడు సునీల్‌ జోషినే సెలెక్టర్‌గా ఉండటం గమనార్హం. అయితే, అతడి సూచనలతో కుల్‌దీప్‌ తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసినా.. ఇషాన్‌ రెండో ఆప్షనే

‘‘కుల్‌దీప్‌ జట్టులో స్థానం కోల్పోయినప్పుడు నేను సెలెక్టర్‌గా ఉన్నా. అతడి బౌలింగ్‌ను మెరుగుపర్చేందుకు కోచింగ్‌ స్టాఫ్‌ కూడా ముందుకు రాలేదు. దీంతో నేను అతడి బౌలింగ్‌లో మార్పులు చేస్తే బాగుంటుందని సూచించా. ఆ తర్వాత జట్టులోకి వచ్చినప్పుడు అతడు తన సత్తా ఏంటో చాటాడు. ఒక్కసారిగా అందరూ అతడి గురించి మాట్లాడుతున్నారు. ఇదే విషయంపై భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి అడిగాడు. కుల్‌దీప్‌ మెరుగుకావడానికి ఏం చేశావు? అని ప్రశ్నించాడు. అయితే, నేనేమీ ప్రత్యేకంగా ఏం చేయలేదు. ఒక బౌలింగ్‌ కోచ్‌గా ఏం చేస్తారో... నేను కూడా కుల్‌దీప్‌ విషయంలో చేశా. ఇప్పుడు కుల్‌దీప్‌ 2.0 బౌలింగ్‌ను గమనిస్తే మీకో విషయం తెలుస్తుంది. అతడి ముంజేయి లక్ష్యంగా చేసుకుని ఉంటుంది. అతడి రనప్‌లోనూ కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. గాలిలో బంతిని వేగంగా విసురుతున్నాడు’’ అని సునీల్ జోషి వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని