SKY: సూర్యకు ‘టెస్టు’ సమయం ఆసన్నమైందన్న గంభీర్‌.. సోషల్‌ మీడియాలో స్పందన

వన్డేలు, టీ20ల్లో రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) టెస్టుల్లోకి అరంగేట్రం చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని గౌతమ్ గంభీర్ (Gautham gambhir) సోషల్‌ మీడియా వేదికగా చెప్పాడు. అయితే నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో వ్యతిరేకత రావడం గమనార్హం.

Published : 08 Jan 2023 20:21 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ఫార్మాట్‌లో అదరగొట్టేస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ ప్రతిభను అందరు ప్రశంసిస్తుంటే.. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ మాత్రం టెస్టుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని సూచించాడు. శ్రీలంకపై మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్‌కు అభినందనలు తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నాయి. సూర్యకుమార్‌ను ప్రశంసిస్తూనే గంభీర్‌ చేసిన సూచనకు అభిమానులు ఫిదా అయ్యారు.

‘‘అద్భుతమైన ఇన్నింగ్స్‌. టెస్టు క్రికెట్‌లోకి తీసుకోవాల్సిన  సమయం ఆసన్నమైంది’’ అని గంభీర్‌ ట్వీట్ చేశాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. అలా కొన్ని స్పందనలు.. 

‘‘గౌతీ.. మీ దగ్గర నుంచి ఉత్తమమైన విషయం ఆశించాం. కానీ అలా జరగలేదు. ఎందుకు అతడినే జట్టులోకి తీసుకోవాలి? మరి రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించే వారి సంగతేంటి? ఉదాహరణకు సర్ఫరాజ్‌.. ఒకవేళ మీరు చెప్పినట్లు సూర్యకుమార్‌ను తీసుకోవాలనుకుంటే సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే వైట్‌బాల్ (వన్డేలు, టీ20లు) క్రికెట్‌లో ఫామ్‌ ఆధారంగా పూర్తి విభిన్నమైన ఫార్మాట్‌కు తీసుకోవాలని చెప్పడం సరైంది కాదు’’

‘‘అవును. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎలా రాణిస్తాడనేది చూడాలి. తప్పకుండా స్టీవ్‌ స్మిత్ కంటే ఉత్తమ బ్యాటర్‌గా మారతాడు’’

‘‘తప్పకుండా టెస్టుల్లోకి సూర్య రావాలి. సుదీర్ఘ ఫార్మాట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ దూకుడైన బ్యాటింగ్ శైలిని మిస్‌ అయ్యాం. ఇప్పుడు సూర్య వస్తే మాత్రం టెస్టులు కూడా అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారతాయి. మూడు ఫార్మాట్లలో అతడిని చూడటం బాగుంటుంది’’

‘‘ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలి? టీ20ల్లో అద్భుతంగా ఆడితే టెస్టుల్లోకి ఎంపిక చేస్తారా..? ఇక సర్ఫరాజ్‌ వంటి క్రికెటర్లు రంజీల్లో రాణించడం ఎందుకు? అందరూ అన్ని ఫార్మాట్లకు అవసరం లేదు. అతడిని టీ20 స్పెషలిస్ట్‌గానే ఆడనివ్వండి’’

‘‘ఇది సరైన నిర్ణయం కాదు. సూర్య మీద అనవసరంగా ఒత్తిడి తీసుకొచ్చి అతడి ఆటను నాశనం చేయొద్దు. టీ20ల తర్వాత వన్డేలపై దృష్టిసారించాలి. ఎందుకంటే వన్డే ప్రపంచకప్‌ లక్ష్యం కావాలి’’

‘‘మీరు ఎందుకు సర్ఫరాజ్‌ ఖాన్, విహారి వంటి వారి గురించి మాట్లాడరు. ప్లీజ్‌ అతడిని టెస్టుల్లోకి, అలాగే వన్డేల్లోకి తీసుకోరావాలని కోరుకోవద్దు’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని