Gautam Gambhir: ‘తుది జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు’.. అది పనికిరాని చర్చ: గంభీర్‌

వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా (Team India) తుదిజట్టు టాప్‌-7లో ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండాలని ఇటీవల భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచించాడు. ఈ వాదనను టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) తప్పుబట్టాడు. 

Published : 22 Aug 2023 21:28 IST

ఇంటర్నెట్ డెస్క్: రాబోయే వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా (Team India) తుది జట్టు టాప్‌-7లో ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండాలని ఇటీవల భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచించాడు. ఈ వాదనను టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) తప్పుబట్టాడు. ఫామ్‌ చూసి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని.. వారు ఎడమచేతి వాటం బ్యాటరా, కుడి వాటం బ్యాటరా? అనే విషయాలను పట్టించుకోవద్దని సూచించాడు. బ్యాటర్లు వారి చేతివాటంతో సంబంధం లేకుండా వివిధ పరిస్థితుల్లో పలు రకాల బౌలర్లను ఎదుర్కొని మంచి ప్రదర్శన చేయడంపైనే దృష్టిపెట్టాలన్నాడు. శ్రేయస్ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్ ప్రపంచకప్ జట్టులో తమ స్థానాలను కాపాడుకోవాలంటే ఆసియా కప్‌లో పరుగులు చేయాల్సిన అవసరముందన్నాడు. అలా జరగకుండా సూర్యకుమార్ యాదవ్‌, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు వారి స్థానంలో జట్టులోకి వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.

‘రోహిత్‌ శర్మను 2011 ప్రపంచకప్‌నకు ఎంపిక చేద్దామనుకున్నాం.. ధోనీ వద్దన్నాడు’

‘‘తిలక్ వర్మ మరికొన్ని మ్యాచ్‌లు ఆడాలి. అతడికి బ్యాటింగ్‌ చేసే అవకాశం దొరికి, ఇతర బ్యాటర్ల కంటే మెరుగ్గా రాణిస్తే కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలి. నేను ఇంతకుముందే చెప్పాను. ఫామ్‌ అనేది ముఖ్యం. అతడు ఎడమచేతి వాటం బ్యాటరా? కుడిచేతి వాటం బ్యాటరా?.. ముగ్గురు లెప్ట్ హ్యాండర్లు అవసరమా అనేది పనికిరాని చర్చ. మనకు నాణ్యమైన ఆటగాళ్లు ముఖ్యం. జట్టులో ఎంతమంది లెప్ట్ హ్యాండర్లు ఉన్నారనేది అనవసరం. బ్యాటర్‌ ఫామ్‌లో ఉంటే రైట్ హ్యాండర్, లెఫ్ట్ హ్యాండర్ అనేదానితో సంబంధం లేకుండా వివిధ పరిస్థితుల్లో అతడు ఎలా రాణిస్తాడో చూసి ఎంపిక చేయాలి. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండాలని నిబంధన ఏమీ లేదు. మనకు క్వాలిటీ ముఖ్యం.. క్వాంటిటీ కాదు’’ అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని