రొనాల్డో మరో రికార్డు

రికార్డుల వేటలో సాగుతున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో చరిత్ర సృష్టించాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా నిలిచాడు.

Published : 25 Mar 2023 02:02 IST

అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా చరిత్ర

లిస్బన్‌: రికార్డుల వేటలో సాగుతున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో చరిత్ర సృష్టించాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా నిలిచాడు. 2024 యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా లిటన్‌స్టైన్‌తో మ్యాచ్‌లో ఈ పోర్చుగల్‌ ఆటగాడు బరిలో దిగాడు. అది అతనికి జాతీయ జట్టు తరపున 197వ మ్యాచ్‌. దీంతో కువైట్‌కు చెందిన బేడర్‌ అల్‌ ముతావా (196)ను రొనాల్డో వెనక్కినెట్టాడు. 2021లోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన ఐరోపా ఆటగాడిగా 38 ఏళ్ల రొనాల్డో నిలిచాడు. ఇప్పుడు ప్రపంచ రికార్డు అందుకున్నాడు. అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ (118) రికార్డూ అతని పేరు మీదే ఉంది. నిరుడు ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌లోనే పోర్చుగల్‌ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో రొనాల్డోను కొన్ని మ్యాచ్‌ల్లో ప్రధాన ఆటగాడిగా కాకుండా సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దించిన విషయమూ విదితమే. దీంతో ఆ ప్రపంచకప్‌ తర్వాత అతను మళ్లీ పోర్చుగల్‌కు ఆడడం అనుమానంగా మారింది. కానీ ఇప్పుడు జట్టుతో చేరి ఆ ఊహాగానాలకు చెక్‌ పెట్టాడు. రొనాల్డో సామర్థ్యంపై నమ్మకం ఉందని కొత్త కోచ్‌ రాబర్టో మార్టినెజ్‌ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని