మెస్సి మాయ.. హోరెత్తిన అర్జెంటీనా

నిరుడు ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలవడంతో తన చిరకాల కోరిక తీర్చుకున్నాడు లియొనల్‌ మెస్సి. ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు అప్పుడు అర్జెంటీనా వాసులు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.

Published : 25 Mar 2023 02:02 IST

బ్యూనోస్‌ ఎయిర్స్‌: నిరుడు ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలవడంతో తన చిరకాల కోరిక తీర్చుకున్నాడు లియొనల్‌ మెస్సి. ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు అప్పుడు అర్జెంటీనా వాసులు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఆ విజయ సంబరాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా ఆ సంబరాలను పురస్కరించుకుని సొంతగడ్డపై పనామాతో ఆడిన స్నేహపూర్వక మ్యాచ్‌లో మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా 2-0 తేడాతో గెలిచింది. థియాగో (78వ నిమిషంలో), మెస్సి (88వ నిమిషంలో) చెరో గోల్‌ చేశారు. ఫ్రీకిక్‌ను గోల్‌పోస్టులోకి పంపించిన మెస్సి.. ఫ్రొఫెషనల్‌ కెరీర్‌లో 800వ గోల్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఇక జాతీయ జట్టు తరపున 100 గోల్స్‌ మైలురాయి చేరుకునేందుకు ఒక్క గోల్‌ దూరంలో ఉన్నాడు. మ్యాచ్‌ తర్వాత సంబరాలు హోరెత్తాయి. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత అర్జెంటీనా ఆడుతున్న తొలి మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని