జ్యోతికి స్వర్ణం
తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి సత్తా చాటింది. జర్మనీలోని కార్ప్‌ఫాజ్ గాలా అథ్లెటిక్స్ ఈవెంట్లో ఈ తెలుగమ్మాయి స్వర్ణం నెగ్గింది.
దిల్లీ: తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి సత్తా చాటింది. జర్మనీలోని కార్ప్‌ఫాజ్ గాలా అథ్లెటిక్స్ ఈవెంట్లో ఈ తెలుగమ్మాయి స్వర్ణం నెగ్గింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 12.84 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఆమె కెరీర్‌లో ఇది రెండో అత్యుత్తమ టైమింగ్. గతేడాది జ్యోతి 12.82 సెకన్ల టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పింది. కార్ప్‌ఫాజ్ గాలా ఈవెంట్లో భారత్‌కు ఇది రెండో పతకం. 200 మీటర్ల పరుగులో అమ్లాన్ బోర్గొహెయిన్ 20.66 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం నెగ్గాడు. మరోవైపు అమెరికాలో జరుగుతున్న లాస్‌ఏంజెలెస్ గ్రాండ్‌ప్రిలో మహిళల 3 వేల మీటర్ల స్టీఫుల్‌ఛేజ్‌లో పరుల్ చౌదరి (9 నిమిషాల 29.51 సెకన్లు) కాంస్యం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక మాజీ క్రికెటర్‌కు బెయిల్
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
Vishnu Manchu: ‘కన్నప్ప’ కోసం 600 మంది త్యాగం చేశారు: డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంచు విష్ణు పోస్ట్
-
Imran Khan: మరో జైలుకు ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
-
Amazon: కృత్రిమ మేధ స్టార్టప్‌లో అమెజాన్ రూ.33 వేల కోట్ల పెట్టుబడులు
-
AIADMK: ఎన్డీయే కూటమికి అన్నాడీఎంకే కటీఫ్.. పార్టీ శ్రేణుల సంబరాలు!