IND vs SA: దక్షిణాఫ్రికాకు ముందే సీనియర్లు

దక్షిణాఫ్రికాలో ఎనిమిదిసార్లు పర్యటించినా టీమ్‌ఇండియా ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోలేదు. 2010-11లో మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకోవడం ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన. వచ్చే నెలలో మరోసారి భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.

Updated : 25 Nov 2023 07:55 IST
దిల్లీ: దక్షిణాఫ్రికాలో ఎనిమిదిసార్లు పర్యటించినా టీమ్‌ఇండియా(IND vs SA) ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోలేదు. 2010-11లో మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకోవడం ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన. వచ్చే నెలలో మరోసారి భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. సఫారీ జట్టుతో మూడేసి వన్డేలు, టీ20ల సిరీస్‌లతో పాటు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈసారి ఎలాగైనా టెస్టు సిరీస్‌ సాధించాలన్న పట్టుదలతో ఉన్న బీసీసీఐ.. కొంతమంది సీనియర్లను ముందే అక్కడికి పంపించే యోచనలో ఉంది. దక్షిణాఫ్రికాలో పర్యటించే ఇండియా-ఎ జట్టు తరఫున వారిని ఆడించే అవకాశముంది. డిసెంబరు 26న భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఇండియా-ఎ జట్టు అక్కడ పర్యటించనుంది. అభిమన్యు ఈశ్వరన్‌, సాయి సుదర్శన్‌, యశ్‌ ధుల్‌, శ్రీకర్‌ భరత్‌, ఉపేందర్‌ యాదవ్‌, సౌరభ్‌ కుమార్‌లకు ఇండియా-ఎ జట్టులో చోటు దక్కడం ఖాయమే. సీనియర్‌ ఆటగాళ్లు ఆజింక్య రహానె, రవిచంద్రన్‌ అశ్విన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌తో పాటు మరికొందరు ఇండియా-ఎ తరఫున ఒకట్రెండు మ్యాచ్‌లు ఆడొచ్చని తెలుస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని