Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్‌ గట్టి పోటీదారు: రవిశాస్త్రి

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గట్టి పోటీదారుగా బరిలో దిగుతుందని మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. యువ ప్రతిభావంతులకు టీమ్‌ఇండియా కేంద్రంగా మారిందని అతను అభిప్రాయపడ్డాడు.

Updated : 28 Nov 2023 07:11 IST

ముంబయి: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గట్టి పోటీదారుగా బరిలో దిగుతుందని మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. యువ ప్రతిభావంతులకు టీమ్‌ఇండియా కేంద్రంగా మారిందని అతను అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రపంచకప్‌ ఓటమి హృదయాన్ని ముక్కలు చేసింది. మనం కప్పు గెలవలేకపోయామనే బాధ ఇప్పటికీ వెంటాడుతోంది. ఎందుకంటే మనది టోర్నీలో అత్యంత బలమైన జట్టు. సచిన్‌ లాంటి గొప్ప ఆటగాడు కూడా ప్రపంచకప్‌ కోసం ఆరో టోర్నీ దాకా ఎదురు చూశాడు. కప్పు గెలవడం అంత తేలిక కాదు. ఆ కీలకమైన రోజు గొప్పగా ఆడాలి. అయితే జట్టులోని కుర్రాళ్లు నేర్చుకుంటారు. ఆట సాగుతూనే ఉంటుంది. అతి త్వరలోనే భారత్‌ ప్రపంచకప్‌ గెలవడం చూస్తా. అది 50 ఓవర్లలో కాకపోవచ్చు. ఈ ఫార్మాట్‌లో జట్టును పునర్నిర్మించడానికి సమయం పడుతుంది. దాని మీద దృష్టిసారించాలి. కానీ త్వరలో జరిగే 20 ఓవర్ల ఫార్మాట్లో భారత్‌ గట్టి పోటీదారు. ఎంతోమంది ప్రతిభావంతులకు భారత్‌ కేంద్రంగా మారింది’’ అని రవిశాస్త్రి చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని