Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే: హనుమ విహారి

వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవడంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి ముందుంటాడు. పుజారా, అజింక్య రహానె గైర్హాజరీలో...

Published : 30 Jun 2022 02:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవడంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి ముందుంటాడు. పుజారా, అజింక్య రహానె గైర్హాజరీలో టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడు క్రీజ్‌లో పాతుకుపోయి మరీ పరుగులు చేయగలడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కూ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్దమేనని తెలిపాడు. ఓ ఆంగ్ల ఛానెల్‌తో మాట్లాడుతూ.. దేశవాళీలోనూ అనేక ఏళ్లపాటు ఇబ్బందులు పడ్డానని, అవకాశాలు తేలిగ్గా రాలేదని విహారి పేర్కొన్నాడు. 

‘‘దేశవాళీలో చాలా ఏళ్లపాటు స్థిరంగా రాణించినా జాతీయ జట్టులోకి వచ్చేందుకు సమయం పట్టింది. అందుకే అవకాశాలు వచ్చే వరకు వేచి చూసేంత ఓపిక నాకుంది.  ఓపిగ్గా ఎదురు చూసిన తర్వాత వచ్చిన ఛాన్స్‌లను ఏమాత్రం వదులుకోకూడదని అనుకున్నా. అవకాశాలు రాలేదని వేరొకరిపై నెపం నెట్టడం సరైంది కాదు. ఎందుకంటే మన దగ్గర పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా చాలా మంది తమకెప్పుడు జాతీయ జట్టులో అవకాశం వస్తుందా..? అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే బరిలోకి దిగిన తర్వాత మాత్రం నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తా’’ అని విహారి వివరించాడు. టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ప్రశంసలు తననెంతో ఉద్వేగానికి గురి చేశాయని విహారి తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని