IND vs ENG: భారత్‌ ఇంగ్లాండ్‌ ఐదో టెస్టులో నమోదైన రికార్డులివే

గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు రెండో...

Published : 06 Jul 2022 02:17 IST

బర్మింగ్‌హామ్‌: గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో ఇంగ్లిష్‌ జట్టు తమ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను పూర్తిచేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. దీంతో పాటు మరికొన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

* టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సాధించినా ఓటమిపాలవ్వడం ఇది రెండోసారి. 2015లో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయినా, ఆ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది.

* టీమ్‌ఇండియాపై టెస్టుల్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక పరుగుల ఛేదన. అంతకుముందు 1977లో పెర్త్‌ వేదికగా జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 339 పరుగుల రికార్డు ఛేదన చేసింది. అలాగే 1987లో దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇక 2002లో జోహెనెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

* ఇక ఇంగ్లాండ్‌ జట్టుకు టెస్టుల్లో ఇదే అత్యధిక ఛేదన. ఇదివరకు 2019లో లీడ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అలాగే 1928/29 సీజన్‌లో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 332 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని