ICC test rankings: కోహ్లీ కిందకి.. పంత్‌పైకి

పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న విరాట్‌కోహ్లీ..తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లో చోటు కోల్పోయాడు

Published : 06 Jul 2022 16:38 IST

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకులో పంత్‌..ఏడేళ్లలో కోహ్లీకి ఇదే చెత్త ర్యాంకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న విరాట్‌కోహ్లీ..తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు కోల్పోయాడు. నాలుగు స్థానాలు దిగజారి 13వ స్థానంలో నిలిచాడు. 2016 నవంబర్‌ తరవాత కోహ్లీ టాప్‌ 10 ఆటగాళ్ల జాబితాలో లేకపోవడం ఇదే తొలిసారి. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో శతకం, అర్ధశతకం బాదిన యువ బ్యాటర్‌ రిషబ్‌పంత్‌ టాప్‌-5లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌కు ముందు పదో స్థానంలో ఉన్న పంత్ 5 స్థానాలు మెరుగుపరుచుకొని తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకింగ్‌ (నెం.5) దక్కించుకున్నాడు.

కొవిడ్‌ కారణంగా ఇంగ్లాండ్‌తో టెస్టుకు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక స్థానం దిగజారి తొమ్మిదో ప్లేస్‌లో ఉన్నాడు. భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్న జానీ బెయిర్‌ స్టో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి టాప్‌10లోకి దూసుకొచ్చాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా నెం.1 స్థానాన్ని కాపాడుకున్నాడు. జోరు మీదున్న జో రూట్‌ నెం 1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. బౌలర్లలో ప్యాట్ కమిన్స్‌ టాప్‌లో ఉన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని