IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్‌ఇండియాదే పైచేయి

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు రెండో రోజు ఆటలో టీమ్‌ఇండియా పట్టు సాధించింది. వర్షం కారణంగా పలుమార్లు ఆటకు అంతరాయం కలిగింది. దీంతో శనివారం ఆట...

Updated : 03 Jul 2022 00:16 IST

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు రెండో రోజు ఆటలో టీమ్‌ఇండియా పట్టు సాధించింది. వర్షం కారణంగా పలుమార్లు ఆటకు అంతరాయం కలిగింది. దీంతో శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 84/5తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో బెన్‌ స్టోక్స్‌ (0; 4 బంతులు), జానీ బెయిర్‌స్టో (12; 47 బంతుల్లో 1x4) ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 332 పరుగులు వెనకబడి ఉంది. కెప్టెన్‌ బుమ్రా (3/35) ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ (6), జాక్‌ క్రాలే (9)తో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఓలీపోప్‌ (10)ను సైతం పెవిలియన్‌ బాట పట్టించాడు. జోరూట్‌ (31)ను మహ్మద్ సిరాజ్, జాక్‌లీచ్‌(0)ను మహ్మద్‌ షమి ఔట్‌ చేశారు. అంతకుముందు టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. 338/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం రెండోరోజు ఆరంభించిన జడేజా, షమి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే జడేజా (104; 194 బంతుల్లో 13x4) టెస్టుల్లో మూడో శతకం సాధించాడు. ఇక షమి, జడ్డూ ఔటయ్యాక చివర్లో బుమ్రా (31 నాటౌట్‌; 16 బంతుల్లో 4x4, 2x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని