Asia Cup : టీమ్‌ఇండియాకు గుడ్‌న్యూస్‌.. కొవిడ్‌ నుంచి కోలుకున్న ద్రవిడ్‌..

ఆసియా కప్‌ టీ20 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు సమరానికి సిద్ధమయ్యారు.

Updated : 28 Aug 2022 12:46 IST

దుబాయ్‌ : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్షణం రానేవచ్చింది. ఆసియా కప్‌ టీ20 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు సమరానికి సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం భారత్‌-పాక్‌ల మధ్య పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియాకు శుభవార్త.. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. దీంతో అతడు జట్టుతో ఆదివారం చేరాడు. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

‘టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది. దీంతో దుబాయ్‌లో భారత జట్టుతో చేరాడు. ఇక తాత్కాలికంగా ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వర్తించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ ‘ఇండియా ఏ’ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు బెంగళూరు తిరిగి వచ్చారు’ అని బీసీసీఐ పేర్కొంది.

ఆసియా కప్‌ కోసం భారత్‌ యూఏఈకి బయలుదేరిన సమయంలో రాహుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో జట్టుతో కలిసి రాలేకపోయాడు. దీంతో బీసీసీఐ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే.

ఇక.. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ కొట్టిన దెబ్బకు ఈ మ్యాచ్‌ ద్వారా భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని