IPL 2024: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు షాక్‌.. స్టార్‌ పేసర్‌కు గాయం

ఐపీఎల్‌-2024 (IPL 2024) ముంగిట డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings)కు షాక్‌! ఆ జట్టు స్టార్‌ పేసర్ గాయం బారినపడ్డాడు. 

Published : 09 Mar 2024 23:27 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2024 (IPL 2024) ముంగిట డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings)కు షాక్‌! ఇప్పటికే ఓపెనర్‌ డేవాన్ కాన్వే ఎడమచేతి బొటనవేలికి గాయమై మొదటి దశ మ్యాచ్‌లకు దూరం కాగా.. తాజాగా ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మతిశా పతిరన గాయం బారినపడ్డాడు. మార్చి 6న బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో పతిరన ఆడాడు. 3.4 ఓవర్లు వేసిన తర్వాత ఎడమ కాలికి కండరాల నొప్పి మొదలవడంతో కోటా పూర్తి చేయకుండానే మైదానం వీడాడు. శనివారం బంగ్లాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌కు కూడా పతిరన దూరంగా ఉన్నాడు. ‘‘తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న పతిరన పూర్తిగా కోలుకోవడానికి సుమారు రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. కాబట్టి, అతడు ఎప్పుడు జట్టుతో కలుస్తాడనే దానిపై స్పష్టత లేదు. సీఎస్కే మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడో లేదో ఈ దశలో చెప్పడం కష్టం’’ అని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. 

పతిరన గత సీజన్‌లో సీఎస్కేకు కీలక బౌలర్‌గా ఉన్నాడు. 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి జట్టు ఛాంపియన్‌గా నిలవడంలోకీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్-2024 సీజన్‌ ఆరంభ పోరు మార్చి 22న బెంగళూరు వేదికగా సీఎస్కే, ఆర్సీబీ మధ్య జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని