Sanjay Manjrekar: ఐపీఎల్‌ 2023..బౌలింగ్‌లో ఆర్సీబీ ఉత్తమంగా రాణించగలదు: సంజయ్‌ మంజ్రేకర్‌

మూడు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌(IPL 2023)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) ఉత్తమ బౌలింగ్‌ యూనిట్‌ని కలిగి ఉందని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్‌ (Sanjay Manjrekar) అన్నాడు.

Published : 27 Mar 2023 21:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌(IPL 2023)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) ఉత్తమ బౌలింగ్‌ యూనిట్‌ని కలిగి ఉందని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్‌ (Sanjay Manjrekar) అన్నాడు. అందులోనూ పేస్‌ బౌలింగ్‌ పటిష్టంగా ఉందని పేర్కొన్నాడు. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు మూడు సార్లు (2009,2011,2016) ఫైనల్‌ వరకు వెళ్లిన ఆర్సీబీ  ఒక్కసారి కూడా టైటిల్‌ని నెగ్గలేకపోయింది. ఈసారైనా ఛాంపియన్‌గా నిలవాలనే లక్ష్యంతో వేలంలో మంచి ఆటగాళ్లను సొంతం చేసుకొని బలమైన జట్టును సిద్ధం చేసుకుంది. ఇంగ్లాండ్‌ పేసర్‌ రీస్‌ టాప్లీని చేర్చుకోవడంతో జట్టుకు మరింత బలం చేకూరింది. హర్షల్‌ పటేల్‌, డేవిడ్‌ విల్లీ (David Willey), కర్ణ్ శర్మ (Karn Sharma), మహమ్మద్‌ సిరాజ్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, రీస్‌ టాప్లీల వంటి స్టార్‌ ఆటగాళ్లతో బౌలింగ్ విభాగం కళకళలాడుతోంది.

‘‘గొప్ప పేసర్లతో ఆర్సీబీ బౌలింగ్‌ విభాగం బలంగా ఉంది. ఒకవేళ జోష్‌ హేజిల్‌వుడ్‌ ఫిట్‌గా లేకపోయినా ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి రీస్‌ టాప్లీ (Reece Topley) ఉన్నాడు. బంతిని గింగిరాలు తిప్పడానికి స్పిన్నర్‌ వనిందు హసరంగ ఉన్నాడు. ఇంకా మహమ్మద్‌ సిరాజ్‌, హర్షల్‌పటేల్‌ రాణిస్తారు.  గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కూడా బౌలింగ్‌ చేయగలడు. కాబట్టి ఆర్సీబీ బౌలింగ్ విభాగం దృఢంగా ఉంది.  అందువల్ల ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆ జట్టు బౌలింగ్‌లో ఉత్తమంగా రాణించగలదు’’ అని పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు