Kane Williamson: కోహ్లీ, బ్రాడ్‌మన్‌ రికార్డును దాటేసిన విలియమ్సన్‌

న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ టెస్టు క్రికెట్‌లో శతకాల పరంగా కోహ్లీ, బ్రాడ్‌మెన్‌లను దాటేశాడు.   

Published : 05 Feb 2024 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) టెస్టు క్రికెట్‌లో మరో రికార్డును సాధించాడు. భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohi), క్రికెట్‌ లెజెండ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌ (Don Bradman) పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును అధిగమించాడు. దక్షిణాఫ్రికా (south Africa)తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో విలియమ్సన్‌ ఈ ఘనత అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన వ్యక్తుల్లో 13వ స్థానానికి చేరుకున్నాడు. 51 శతకాలతో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తొలిస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ ఆటగాడు జోరూట్‌, మథ్యూహెడెన్‌ సైతం 30 శతకాలు చేశారు. విలియమ్సన్ మొత్తం 97 టెస్టుల్లో 169 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో తన అత్యధిక స్కోరు 251 పరుగులు.

బేఓవల్‌ వేదికగా స్వదేశంలో సౌతాఫ్రికాతో న్యూజిలాండ్‌ (South Africa vs New Zealand) తొలి టెస్టు ఆడుతోంది. తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ ఆటముగిసే నికిసమయా 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే(1), టామ్‌ లాథమ్‌(20) స్వల్ప స్కోర్లకే పరిమితమైనప్పటికీ రచిన్‌ రవీంద్ర (118*: 211 బంతుల్లో), విలియమ్సన్‌(112*: 259 బంతుల్లో) జట్టును ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపారు. చెరోసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వీరు.. అనంతరం దక్షిణాఫ్రికా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మూడో వికెట్‌కు 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని