Asia Cup 2023: కేఎల్ కోసం అతడిని పక్కన పెట్టొచ్చు.. ఇషాన్ తుది జట్టులో ఉండాల్సిందే: గావస్కర్
ఆసియా కప్‌లోని (Asia Cup 2023) సూపర్ -4 మ్యాచుల్లో ఆడేందుకు కేఎల్ రాహుల్ సిద్ధమైపోతున్నాడు. అయితే, అతడి కోసం ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో (Asia Cup 2023) భారత్ సూపర్ - 4 స్టేజ్‌కు వెళ్లిపోయింది. అయితే, తుది జట్టు ఎంపికపై మాత్రం తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఫిట్‌నెస్ నిరూపించుకుని కేఎల్ రాహుల్ (KL Rahul) అందుబాటులోకి వస్తాడు. అలాగే వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) కోసం ప్రకటించే జట్టులోనూ కేఎల్ ఉండే అవకాశాలు ఎక్కువే. దీంతో సూపర్ -4లో రాహుల్‌ను ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే, అతడిని తుది జట్టులోకి తీసుకోవాలంటే ఒకరిని రిజర్వ్‌కు పరిమితం చేయాల్సి ఉంటుంది. వికెట్ కీపర్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌ను తప్పించే అవకాశం లేదు. పాక్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఎవరిని తప్పించనున్నారనేది కీలకం కానుంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలంటే శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టాలని సూచించాడు. ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉండాల్సిందేనని వ్యాఖ్యానించాడు.
‘‘వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌ను తప్పించడం సరైంది కాదు. కేఎల్ రాహుల్ వచ్చినా అతడిని కేవలం బ్యాటర్‌గానే పరిగణించాలి. నేపాల్‌తో మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడతాడో చూద్దామని భావించా. కానీ, శ్రేయస్ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే టాప్ -4 బ్యాటర్లు బరిలోకి దిగే అవసరం ఉండేది. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ శ్రేయస్ పరుగులు చేయకుండా ఉంటే.. సూపర్ -4 మ్యాచుల్లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వరుసగా నాలుగు, ఐదుస్థానాల్లో బ్యాటింగ్‌కు దిగొచ్చు.
ఇక్కడ అడుగుపెట్టే నాటికే వరల్డ్ కప్ జట్టుపై ఓ అంచనాకు వచ్చేశాం
పాక్‌పై 80+ పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్‌ను తప్పించలేరు. క్లిష్టమైన పరిస్థితుల్లో విలువైన పరుగులు సాధించాడు. ఇషాన్‌ను రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టడం కూడా సరైన పద్ధతి కాదు. ఎడమచేతివాటం బ్యాటర్ కావడం వల్ల జట్టు కూర్పులోనూ మరింత వైవిధ్యం వచ్చినట్లవుతుంది’’ అని సునీల్ గావస్కర్ తెలిపాడు. ఆసియా కప్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. కేఎల్ ఫిట్‌నెస్‌ను ఎన్‌సీఏ ధ్రువీకరించడంతో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చేయనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా: సిద్ధార్థ్
-
Deaths: ‘మహా’ ఘోరం.. ఆస్పత్రిలో ఒకేరోజు 24 మంది మృతి
-
Ts News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎన్ శివశంకర్ ఛైర్మన్‌గా పీఆర్సీ ఏర్పాటు
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’పై స్పందించిన వివేక్ అగ్నిహోత్రి.. ఏమన్నారంటే?
-
Social Look: సమంత కల.. రుక్సార్ హొయలు.. నిహారిక ఫొటోషూట్
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు