Kl Rahul: కేఎల్‌ రాహుల్‌కు సర్జరీ విజయవంతం.. త్వరలోనే జట్టులోకి..!

టీమ్‌ఇండియా కీలక ఆటగాడు కేఎల్‌  రాహుల్ త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్‌ జర్మనీలో చికిత్స పొందుతున్నాడు. అయితే తాజాగా ట్విటర్‌ ద్వారా రాహుల్‌ తన ఆరోగ్యానికి సంబంధించిన  అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘గాయం కార

Published : 30 Jun 2022 14:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా కీలక ఆటగాడు కేఎల్‌  రాహుల్ త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్‌ జర్మనీలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ట్విటర్‌ ద్వారా రాహుల్‌ తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘గాయం కారణంగా కొన్ని వారాల నుంచి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా సర్జరీ పూర్తైయింది. నెమ్మదిగా కోలుకుంటున్నాను. నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించిన అభిమానులందరికీ ధన్యవాదాలు. త్వరలోనే కలుస్తా’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశాడు.

రోహిత్‌ గైర్హాజరీలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన రాహుల్‌.. తొలి టీ20కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డాడు. దీంతో ఆ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్‌తో కీలక టెస్టు మ్యాచ్‌కు కేఎల్‌ అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. అయితే రాహుల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన బీసీసీఐ వైద్య బృందం.. అతడు మెరుగైన చికిత్సకోసం జర్మనీ వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో ఇంగ్లాండ్ పర్యటనకు కేఎల్ రాహుల్ దూరమైనట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా అధికారికంగా ప్రకటించారు. గ‌జ్జ‌ల్లో గాయం తీవ్ర‌త పెర‌గ‌డంతో చికిత్స కోసం కేఎల్ రాహుల్ జ‌ర్మ‌నీ వెల్ల‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌కు జర్మనీలో స్పోర్ట్స్‌ హెర్నియా సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. మరో వారంలో అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకుని శిక్షణ తీసుకుంటాడని సమాచారం. జులైలో జరిగే ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌లకు అతడు అందుబాటులో ఉండడు. అయితే ఆగష్టులో జరిగే ఆసియాకప్‌ నాటికి టీమ్‌ఇండియాలో చేరే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని