Arjun Tendulkar: అర్జున్‌ తెందూల్కర్‌ని సచిన్‌తో పోల్చకండి: కపిల్‌ దేవ్

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ని స్వేచ్ఛగా ఆడనివ్వాలని భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్ అన్నారు. సచిన్‌తో పోల్చి అతడిపై ఒత్తిడి తీసుకురావద్దని అభిమానులను కపిల్‌ దేవ్‌ కోరారు.

Published : 05 Jun 2022 02:26 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ని స్వేచ్ఛగా ఆడనివ్వాలని భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్ అన్నారు. సచిన్‌తో పోల్చి అతడిపై ఒత్తిడి తీసుకురావద్దని అభిమానులను కపిల్‌ దేవ్‌ కోరారు. 2018లో అండర్‌-19 అరంగేట్రం చేసిన అర్జున్‌ తెందూల్కర్‌.. 2020లో జరిగిన అండర్‌-19 ప్రపంచ కప్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. తర్వాత ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబయి జట్టుకి ఆడాడు. అనంతరం భారత టీ20 లీగ్‌లో అర్జున్‌ తెందూల్కర్‌ గత రెండు సీజన్లలో ముంబయి జట్టు కొనుగోలు చేసింది. కానీ, అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు.

‘అందరూ అర్జున్‌ తెందూల్కర్‌ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే అతడు సచిన్ తెందూల్కర్ కుమారుడు. అర్జున్‌ని తన సొంత క్రికెట్ ఆడనివ్వండి. అతడిని సచిన్‌తో పోల్చవద్దు. తెందూల్కర్ పేరు ఉండటం వల్ల అతనికి లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. ఇలాంటి ఒత్తిడిని తట్టుకోలేకే డాన్ బ్రాడ్‌మాన్ తనయుడు తన ఇంటిపేరును మార్చుకున్నాడు. ఎందుకంటే అతడు తన తండ్రిలా మారతాడని అందరూ ఊహించారు. అర్జున్‌పై ఒత్తిడి తీసుకురావద్దు. అతను చిన్న పిల్లవాడు. అతనికి గ్రేట్‌ సచిన్ తండ్రిగా ఉన్నప్పుడు ఏదైనా చెప్పడానికి మనం ఎవరం? కానీ, నేను అతనికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.  స్వేచ్ఛగా నీ ఆటని ఆస్వాదించు. నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ నాన్నలాగా నువ్వు 50 శాతం ఆడితే అంతకన్నా గొప్ప విషయం మరోటి ఉండదు. తెందూల్కర్ అనే పేరు రాగానే మా అంచనాలు పెరుగుతాయి. ఎందుకంటే, సచిన్ చాలా గొప్పవాడు’ అని కపిల్‌ దేవ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని