Mithali Raj: ‘మిథాలీ భారత మహిళా క్రికెట్‌కు మూల స్తంభం.. ఎంతో మందికి రోల్‌ మోడల్‌’

భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటన చేశారు.

Updated : 08 Jun 2022 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటన చేశారు. 23 ఏళ్లపాటు భారత మహిళా క్రికెట్‌కు సేవలందించిన మిథాలీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌ బాగుండాలని ఆకాంక్షిస్తూ బీసీసీఐ, ఐసీసీతోపాటు పలువురు క్రీడాకారులు ట్వీట్లు చేస్తున్నారు. 

  • ‘భారత క్రికెట్‌కు మీరు అందించిన సేవలు అసాధారణమైనవి. కెరీర్‌లో అద్భుతంగా రాణించారు. మీరు గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు. మీ రెండవ ఇన్నింగ్స్‌ విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాం’

- బీసీసీఐ 

  • ‘అద్భుతమైన కెరీర్ ముగిసింది! భారత క్రికెట్‌కు అపారమైన సహకారం అందించిన మిథాలీ రాజ్‌కు ధన్యవాదాలు. మీ నాయకత్వం జాతీయ మహిళా జట్టుకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది.   మీ తదుపరి ఇన్నింగ్స్‌కు బాగుండాలని కాంక్షిస్తున్నా’

- బీసీసీఐ సెక్రటరీ జై షా 

  • ‘కెరీర్‌ ముగింపు వరకు మిథాలీ తన సహచర క్రికెటర్ల కంటే ఎక్కువ కాలం ఫామ్‌లో ఉంది. ఆమె భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసింది. మిథాలీ రాజ్‌ మీ సెకండ్ ఇన్నింగ్స్‌ బాగుండాలి’

వసీం జాఫర్ 

  • ‘అద్భుతమైన కెరీర్‌ని పూర్తి చేసుకున్న మిథాలీ రాజ్‌కు శుభాకాంక్షలు. మీరు ఎంతో మందికి రోల్ మోడల్,స్ఫూర్తి. మీ సెకండ్ ఇన్నింగ్స్‌లో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’

- అనిల్‌ కుంబ్లే

  • ‘భారతదేశం కోసం ఆడాలని చాలా కొద్దిమంది మాత్రమే కలలుగంటారు. 23 సంవత్సరాల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. మీరు భారతదేశంలో మహిళల క్రికెట్‌కు మూలస్తంభంగా ఉన్నారు. చాలా మంది యువ మహిళా క్రికెటర్ల జీవితాలను తీర్చిదిద్దారు. మీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు’

వీవీఎస్‌ లక్ష్మణ్










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని