
పంత్ టీమ్‌ఇండియా కెప్టెనైనా ఆశ్చర్యపోను
మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్
(Photo: Mohammed Azharuddin Twitter)
ఇంటర్నెట్‌డెస్క్: వచ్చేవారం ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ పేరును ప్రకటించడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ ఆ జట్టుకు కెప్టెన్‌గా సరైనోడని కితాబిస్తున్నారు. దిల్లీ కోచ్ రికీ పాంటింగ్‌తో సహా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సీఎస్కే ఆటగాడు సురేశ్ రైనా అనేక మంది పంత్ సారథిగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ సారథి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ మరోఅడుగు ముందుకేసి మరీ పంత్ కెప్టెన్సీ విషయంపై స్పందించాడు.
తాజాగా ఓ ట్వీట్ చేస్తూ ఈ యువ ఆటగాడిని భవిష్యత్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా చూసినా ఆశ్చర్యపోనని అన్నాడు. ‘పంత్ కొన్ని నెలలుగా అన్ని ఫార్మాట్లలోనూ అతడేంటో నిరూపించుకుంటున్నాడు. సమీప భవిష్యత్తులో టీమ్‌ఇండియా కెప్టెన్ రేసులో సెలక్టర్ల దృష్టిలో అందరికన్నా ముందున్నా నేను ఆశ్చర్చపోను. అతడి దూకుడైన ఆటతీరు భవిష్యత్‌లో టీమ్‌ఇండియాను మంచి స్థితిలో నిలుపుతుంది’ అని అజ్జూ పేర్కొన్నాడు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ తన స్థానంలో పంతే సరైన ఆటగాడనడంలో ఎలాంటి అనుమానం లేదన్నాడు. జట్టుకు అద్భుత విజయాలు అందించాలని ఆకాంక్షించాడు. వచ్చిన అవకాశాన్ని పంత్ సద్వినియోగం చేసుకుంటాడని, అది చూడటం కోసం తాను ఎదురుచూస్తున్నానని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక సురేశ్ రైనా స్పందిస్తూ.. కొత్త బాధ్యతల్లో పంత్ అత్యద్భుతంగా రాణిస్తాడని మెచ్చుకున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.