Dhoni- Jadeja: ధోని తర్వాత చెన్నై కెప్టెన్‌ అతడే.! : రాబిన్‌ ఉతప్ప

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సత్తా ఏంటో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనికి తెలుసని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప అన్నాడు. అందుకే ధోని తన రిటైర్మెంట్..

Updated : 01 Dec 2021 10:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సత్తా ఏంటో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనికి తెలుసని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప అన్నాడు. అందుకే ధోని తన రిటైర్మెంట్ తర్వాత చెన్నై పగ్గాలను జడేజాకే అప్పగిస్తాడని అనుకుంటున్నానని పేర్కొన్నాడు! జడేజాకు మార్గం సుగమం చేస్తూ ధోని.. తనకు తానే రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడని తెలిపాడు. మరోవైపు ఇటీవల సీఎస్కే సమర్పించిన అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో రవీంద్ర జడేజాను మొదటి ప్రాధాన్య ఆటగాడిగా ఎంచుకోవడం.. ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల ధోని కూడా తన చివరి మ్యాచ్‌ చెన్నైలోనే ఆడతానని ప్రకటించడం గమనార్హం.

‘ధోని కావాలనే రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. జట్టులో జడేజా సత్తా ఏంటో అతడికి బాగా తెలుసు. ధోని నిష్క్రమణ తర్వాత జడేజాకే పగ్గాలు అప్పగిస్తాడనుకుంటున్నాను’ అని రాబిన్‌ ఉతప్ప పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్ పార్థివ్‌ పటేల్ కూడా సమర్థించాడు. ‘చెన్నై జట్టు తర్వాతి కెప్టెన్‌కి కావాల్సిన అన్ని లక్షణాలు జడేజాలో ఉన్నాయి. అతడో గొప్ప ఆటగాడు. టెస్టు క్రికెట్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. వన్డే క్రికెట్లో కూడా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి దిగి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అందుకే, ధోని తర్వాతి కెప్టెన్‌గా జడేజానే సరైనోడనిపిస్తోంది’ అని పార్థివ్‌ పటేల్ అన్నాడు. ఇటీవల సీఎస్కే యాజమాన్యం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), ధోని (12 కోట్లు), మొయీన్ అలీ (రూ.8 కోట్లు)‌, రుతురాజ్‌ (రూ. 6 కోట్లు)లను రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ద్వారా యాజమాన్యం కూడా ధోని తర్వాతి కెప్టెన్‌ ఎవరో చెప్పకనే చెప్పినట్లయింది!

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని