MS Dhoni ‘చేతక్‌’ గురించి తెలుసా?

టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌కింగ్స్‌ నాయకుడు ఎంఎస్‌ ధోనీకి ఆటే కాకుండా ఇతర వ్యాపకాలు చాలా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు...

Published : 09 May 2021 00:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌కింగ్స్‌ నాయకుడు ఎంఎస్‌ ధోనీకి ఆటే కాకుండా ఇతర వ్యాపకాలు చాలా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. ఒక స్పోర్ట్స్‌ వెంచర్‌ నడుపుతున్నాడు. ఇతర వ్యాపారాలూ ఉన్నాయి. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో ఓ ఫుట్‌బాల్‌ జట్టుకు సహ యజమాని.

తాజాగా ఎంఎస్‌ ధోనీ వ్యవసాయ క్షేత్రంలోకి ఒక కొత్త గుర్రం వచ్చింది. మహీ కుటుంబం దానిని ఈ మధ్యే కొనుగోలు చేసింది. ‘చేతక్‌’ అని నామకరణం చేసినట్టు సోషల్‌ మీడియా ద్వారా సాక్షీసింగ్‌ తెలిపింది. ‘ఇంట్లోకి స్వాగతం చేతక్‌! నిజమైన జెంటిల్‌మన్‌. ప్రత్యేకించి లిల్లీని కలిసినప్పుడు! సంతోషంగా మా కుటుంబాన్ని అంగీకరించింది’ అని పేర్కొంది. ప్రస్తుతం ధోనీ వ్యవసాయ క్షేత్రంలో సామ్‌, లిల్లీ, జోయా, గబ్బర్‌ అనే నాలుగు శునకాలూ ఉన్నాయి. లిల్లీ, గబ్బర్‌ తెలుపురంగు హస్కీలు. జోయా డచ్‌ షెపర్డ్‌. సామ్‌ బెల్జియం మలినోయిస్‌.

నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌-21లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ధోనీ అద్భుతంగా నడిపించాడు. తన అనుభవం, పిచ్‌లు, పరిస్థితులపై అవగాహనతో మంచి వ్యూహాలు రచించాడు. 7 మ్యాచుల్లో 5 గెలిచి 10 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిపాడు. అయితే బ్యాట్స్‌మన్‌గా అంతగా ప్రభావం చూపించలేదు. 7 మ్యాచుల్లో 37 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 18.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని