Praggnanandhaa: మరో రెండు విజయాలు సాధించిన ప్రజ్ఞానంద

ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను సోమవారం ఓడించిన భారత యువ కెరటం ప్రజ్ఞానంద తాజాగా మరో రెండు...

Updated : 22 Feb 2022 12:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను సోమవారం ఓడించిన భారత యువ కెరటం ప్రజ్ఞానంద తాజాగా మరో రెండు రౌండ్లలో విజయం సాధించాడు. మంగళవారం జరిగిన పోటీల్లో ఈ 16 ఏళ్ల యువ గ్రాండ్‌మాస్టర్‌ రష్యా ఆటగాడు నాడిర్‌బెక్‌ అబ్దుసట్టారావ్‌తో డ్రా చేసుకోగా.. 10, 12 రౌండ్లలో అండ్రీ ఎసిపెంకో, అలెగ్జాండ్రా కోస్టిన్యూక్‌లను ఓడించాడు. ఈ క్రమంలోనే 11వ రౌండ్‌లో జీఎం లాన్‌ నెమోనియాచి చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో ప్రజ్ఞానంద ఇప్పుడు 15 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు.

ఇక ఈరోజు రాత్రి జరిగే పోటీల్లో ఈ యువ కెరటం మరో ముగ్గురు ప్లేయర్లతో తలపడనున్నాడు. తొలుత 13వ రౌండ్‌లో జర్మనీ ప్లేయర్‌ విన్‌సెట్‌ కీమర్‌తో, ఆపై 14వ రౌండ్‌లో అమెరికా ప్లేయర్‌ హాన్స్‌ మోకె నీమన్‌తో పోరాడాక చివరగా 15వ రౌండ్‌లో రష్యా ఆటగాడు వ్లాదిస్లేవ్‌ ఆర్తెమీవ్‌తో పోటీపడనున్నాడు. మరోవైపు సోమవారం ప్రజ్ఞానంద చేతిలో ఓటమిపాలైన కార్ల్‌సన్‌ మంగళవారం పుంజుకున్నాడు. అతడు వరుసగా క్వాంగ్‌ లీమ్‌ లె, జాన్‌ క్రీస్టాఫ్‌ దుడాపై గెలుపొందాడు. కానీ, కెనడా ఆటగాడు ఎరిక్‌ హాన్‌సెన్‌ చేతిలో ఎదురుదెబ్బ తగిలి ప్రస్తుతం 20 పాయింట్లతో అర్తెమీవ్‌, కీమర్‌తో సమానంగా రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, ఈ పోటీల్లో టాప్‌ ఎనిమిది స్థానాల్లో నిలిచిన ప్లేయర్లే తర్వాత జరిగే నాకౌట్‌ దశకు చేరుకుంటారు. దీంతో ప్రజ్ఞానంద అక్కడికి చేరాలంటే మున్ముందు ఇంకా బాగా రాణించాలి. ప్రస్తుతం జరుగుతున్న తొలిదశ పోటీల్లో ఇంకా ఏడు రౌండ్లు మిగిలి ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని