IND vs BAN: బంగ్లాతో తొలి వన్డే.. అభిమానుల మద్దతుపై రోహిత్ శర్మ కామెంట్
టీమ్ఇండియాకు అభిమానుల మద్దతు గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా స్పందించాడు.
ఢాకా: టీమ్ఇండియాతో తొలి వన్డే కోసం భారత బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా ఈసారి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘‘టీమ్ఇండియాకు ప్రపంచమంతా అభిమానులు ఉంటారు’’.. అంటూ విలేకరి తన ప్రశ్నను మొదలు పెట్టగానే రోహిత్ కల్పించుకుని ‘‘ఒక్క బంగ్లాదేశ్‌లో తప్ప’’ అంటూ దానిని పూర్తిచేశాడు. అనంతరం మాట్లాడుతూ.. అందుకు గల కారణాలను వివరించాడు. వేదిక ఏదైనా తమ జట్టు పోరాడేందుకు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నాడు.
‘‘మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య కాస్త కంగారు పెట్టేవిధంగానే ఉండవచ్చు. అయితే వారంతా క్రికెట్‌ను ఎంతో అభిమానించేవారు. వారి జట్టుకు మద్దతునివ్వడానికి వస్తుంటారు. సొంత గడ్డపై ఆడే జట్టుకు అది మరింత ఉత్సాహాన్నిస్తుంది. అయితే, ఈ వేదికపై మాకు అభిమానుల మద్దతు లేకపోయినా మా ఆటగాళ్లకు ఎలాంటి నష్టం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఆడిన అనుభవం మాకుంది. అక్కడ సైతం మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. వారు కూడా తమ జట్లను ఉత్సాహపరచాలనుకుంటారు. ఎక్కడైనా ఇదే జరుగుతుంది. ఒత్తిడిని అధిగమించడం, సవాళ్లను ఎదుర్కోవడం మా ఆటగాళ్లకు అలవాటే. కాబట్టి అదేమీ సమస్య కాదు’’ అంటూ రోహిత్ శర్మ బదులిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్‌లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్‌లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్‌లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్‌నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్‌కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్‌రైజర్స్‌పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్‌లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్‌లో అర్హత సాధించడానికి భారత్‌కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్‌కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్‌లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్‌లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్‌స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్‌గా సీరియస్‌గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు