WPL : డబ్ల్యూపీఎల్‌లో ‘RRR’ క్షణం.. ఆ ఎనర్జీ మాలోనూ ఉందన్న జెమీమా
WPL మ్యాచ్‌లు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. అయితే.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఓ ఘటనను దిల్లీ బ్యాటర్ RRR చిత్రంతో పోల్చడం నెటిజన్లను ఆకట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: డబ్ల్యూపీఎల్ (WPL)ను దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఆర్సీబీ(RCB)పై గెలుపొందింది. కెప్టెన్ లానింగ్, షెఫాలి వర్మ దంచి కొట్టడంతో దిల్లీ.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఓపెనర్లు పెవిలియన్ చేరిన అనంతరం క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues), మారిజానే(Marizanne Kapp).. ఓ బంతిని నో బాల్‌గా ప్రకటించాలని అంపైర్ ముందు అప్పీల్ చేశారు. వారు అప్పీల్ చేసిన తీరు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై జెమీమా స్పందిస్తూ.. ఇటీవల రికార్డులను తిరగరాసిన పాన్‌ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్(RRR)లోని ఓ ఫొటోని షేర్ చేసింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో పోల్చుకుంటూ.. అదే ఎనర్జీ మాలోనూ ఉందని సరదా వ్యాఖ్యను జోడించింది.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ 223/2 చేయగా.. బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
Movies News
Prem Rakshit: మరోసారి రాజమౌళితో ‘నాటు నాటు’ కొరియోగ్రాఫర్
-
India News
Manish Sisodia: ఆ పుస్తకాలు ఇప్పించండి.. చదువుకుంటా..!: కోర్టును కోరిన సిసోదియా
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!
-
World News
Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్‌స్టార్’ మృతి