Sachin-Warne : షేన్‌వార్న్‌ జయంతి.. సచిన్‌ భావోద్వేగ పోస్టు

క్రికెట్‌ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను తన ఖాతాలో వేసుకొన్న ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం షేన్‌ వార్న్‌ జయంతి నేడు (సెప్టెంబర్ 13). ఈ సందర్భంగా వార్న్‌ను సేవలను..

Published : 13 Sep 2022 23:15 IST

(పాతచిత్రం)

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌ చరిత్రలో ఎన్నోరికార్డులను తన ఖాతాలో వేసుకొన్న ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం షేన్‌ వార్న్‌ జయంతి నేడు (సెప్టెంబర్ 13). ఈ సందర్భంగా వార్న్‌ సేవలను స్మరించుకుంటూ సోషల్‌ మీడియాలో పలువురు పోస్టులు పెట్టారు. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, షేన్‌వార్న్‌ కూడా మైదానంలో, వెలుపలా మంచి మిత్రులుగా ఉండేవారు. తన స్నేహితుడిని తలుచుకొని సచిన్‌ కూడా ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘‘కాలం చాలా వేగంగా జరిగిపోయింది. నీ జయంతి సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటున్నా. నీతో ఎన్నో అద్భుత జ్ఞాపకాలతో కూడిన క్షణాలను గడిపాను. ఎప్పటికీ వాటిని మరిచిపోలేను సహచరుడా..!’’ అని ట్వీట్ చేశాడు. 

వార్న్‌ 53వ జయంతి సందర్భంగా అతడి పేరిట కొనసాగుతున్న ట్విటర్ ఖాతా నుంచి వచ్చిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘కొన్ని ముఖ్యమైన వాటిపై లెగసీ అందిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఏమి సాధించారు.. వ్యక్తులు, ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం చూపారు అనే అంశాలు కీలకం. షేన్‌ వార్న్‌ వారసత్వం  కొనసాగుతుంది. మా హృదయాల్లో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. హ్యాపీ బర్త్‌డే’’ అని పోస్ట్‌ వచ్చింది. కెరీర్‌లో ఉన్నత స్థానాలకు ఎదిగిన షేన్‌ వార్న్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తన ఆటతీరుతోనే కాకుండా పలు వివాదాలతో వార్తల్లో నిలిచేవాడు. అయితే ఆసీస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని