Womens U19 Team: బుధవారం సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్‌కప్ విజేతలకు సత్కారం
అండర్ - 19 మహిళల ప్రపంచకప్ (U19 Womens World Cup) విజేతగా టీమ్‌ఇండియా (Team India) నిలిచింది. ఈ క్రమంలో ప్లేయర్లను సత్కరించేందుకు బీసీసీఐ (BCCI) ప్రణాళికలను సిద్ధం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: తొలిసారి నిర్వహించిన అండర్ - 19 మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను టీమ్‌ఇండియా ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి మరీ విజేతగా నిలిచింది. దీంతో యువ ప్లేయర్లను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బందికి రూ. 5 కోట్లను నజరానాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో భారత క్రీడాకారిణులను ప్రత్యేకంగా సత్కరించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. మ్యాచ్‌కు ముందు అండర్ - 19 మహిళల ప్రపంచకప్ విజేతలను సత్కరిస్తామని బీసీసీఐ వెల్లడించింది. ఇవాళ దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి భారత మహిళల అండర్ -19 జట్టు చేరుకొంటుంది. ‘‘అండర్ -19 మహిళల ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్ జట్టు సభ్యులకు సచిన్ తెందూల్కర్, బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 1 సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది’’ అని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విటర్ వేదికగా ప్రకటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Wasim Jaffer: సూర్యకుమార్‌కు బదులు సంజూ శాంసన్‌ని తీసుకోండి: వసీం జాఫర్
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
Movies News
Rashmika: మనుషులందరినీ ఒకేలా చూస్తా.. అందుకే వాళ్ల కాళ్లకు దండం పెడతా: రష్మిక
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
World News
World Bank: ఉక్రెయిన్ను పునర్నిర్మించాలంటే.. రూ.33లక్షల కోట్లు అవసరం..!