బిగ్‌బాస్‌ విన్నర్ చేతిలో సచిన్‌ ఔట్‌.. వీడియో వైరల్‌

మైదానంలో థ్రిల్లింగ్ సంఘటన చోటుచేసుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar) బిగ్‌బాస్‌ విన్నర్ చేతిలో ఔట్‌ అయ్యాడు. 

Updated : 07 Mar 2024 12:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్ దిగ్గజాలు, సెలబ్రిటీల సందడి మధ్య ఇండియన్ స్ట్రీట్ క్రికెట్ లీగ్‌ (ISPL) ఘనంగా ఆరంభమైంది. బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకొంది. బిగ్‌బాస్‌ విన్నర్ మునావర్‌ ఫరూఖీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఏకంగా మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌(Sachin Tendulkar)ను పెవిలియన్‌కు చేర్చాడు. మహారాష్ట్రలోని థానెకు చెందిన దాదోజీ కొండదేవ్‌ స్టేడియం ఇందుకు వేదికైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

ఐఎస్‌పీఎల్‌ తొలి ఎడిషన్‌లో భాగంగా ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. సచిన్‌ సారథ్యంలోని ‘మాస్టర్ లెవెన్‌’.. ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలోని ‘ఖిలాడీ లెవెన్‌’ దీనిలో పోటీ పడ్డాయి. 16 బంతుల్లో 30 పరుగులతో సచిన్‌ మంచి ఊపు మీదున్న సమయంలో ఫరూఖీ ఆయన్ను ఔట్ చేశాడు. చివరకు  మాజీ క్రికెటర్‌ టీమ్‌కే విజయం దక్కింది. ఇదిలా ఉంటే.. ఈ లీగ్‌లో హైదరాబాద్‌ జట్టును హీరో రామ్‌చరణ్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్లు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌ వరుసగా ముంబయి, శ్రీనగర్‌, బెంగళూరు జట్లను కొనుగోలు చేశారు. హీరో సూర్య చెన్నై , సైఫ్ అలీఖాన్‌ జంట కోల్‌కతా జట్లను సొంతం చేసుకున్నారు. తొలి మ్యాచ్‌లో ముంబయి, శ్రీనగర్ తలపడ్డాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని