Rahul Dravid: నా బ్యాటింగ్‌ చూశారు.. సిక్స్‌లు కొట్టారు : ద్రవిడ్‌ సరదా స్పందన

టీమ్‌ ఇండియా సిక్స్‌లు కొట్టడం వెనక ఉన్న రహస్యాన్ని హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) వివరించాడు.

Published : 11 Mar 2024 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ (IND vs ENG 2024)లో భారత్‌ అన్ని విభాగాల్లో రాణించింది. 4-1 తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించి అపూర్వ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఆటగాళ్లు పలు రికార్డులతో చెలరేగగా.. అత్యధిక సిక్స్‌లు నమోదైన టెస్టు సిరీస్‌గానూ ఇది చరిత్రలోకి ఎక్కింది. మొత్తం 102 సిక్స్‌లు నమోదు కాగా.. ఇంగ్లాండ్‌కే బజ్‌బాల్‌ ఆటను చూపించిన రోహిత్‌ సేన(Team India) అందులో 72 సిక్స్‌లు బాదింది.

ఈ సిరీస్‌లో అదరగొట్టిన యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ 29 సిక్స్‌లు కొట్టి.. రోహిత్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. టీమ్‌ఇండియా సిక్స్‌ హిట్టింగ్‌ పవర్‌పై హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఫన్నీగా స్పందించాడు. ‘నేను నా బ్యాటింగ్‌ వీడియోలను జట్టు సభ్యులకు చూపించాను. అందుకే వారు ఇప్పుడు సిక్స్‌లు కొడుతున్నారు’’ అని సరదాగా అన్నాడు. ‘చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. ఇది వేరే లెవల్‌. టీమ్‌ఇండియా సృష్టించిన అత్యుత్తమ సిక్స్‌ హిట్టర్‌ రోహిత్‌ శర్మ. సిక్స్‌ కొట్టే నైపుణ్యం, సామర్థ్యం అసాధారణమైంది. ప్రతిసారీ ఆటగాళ్లు సిక్స్‌ కొడుతున్నప్పుడు.. అది స్టేడియం దాటి వెళ్తుందేమో అనిపించింది’ అని ద్రవిడ్‌ అన్నాడు.

నాయకులైతే మారారు... మరి ఫలితం మారుస్తారా?

ఇక ఈ సిరీస్‌ విజయంతో టీమ్‌ఇండియా WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే ఊపు కొనసాగించి ఫైనల్‌కు చేరి.. టైటిల్‌ నెగ్గాలని అభిమానులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని