Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
వచ్చిన తక్కువ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తానెంటో నిరూపించుకున్న సంజూ శాంసన్ (Sanju Samson)ని జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్లో మైదానంలో నలువైపులా ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించే సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. వన్డే క్రికెట్‌కి వచ్చేసరికి పూర్తిగా తేలిపోతున్నాడు. వరుస మ్యాచ్‌లో విఫలమవుతూ విమర్శల పాలవుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్ కావడంతో అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) కూడా సూర్యకుమార్ పేలవమైన ఆటతీరు పై స్పందించారు. సూర్యకుమార్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే వచ్చిన తక్కువ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్ (Sanju Samson)కు మద్దతుగా నిలిచారు.
వరుసగా విఫలమవుతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశాలిస్తున్నారని, మరి వచ్చిన తక్కువ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తానేంటో నిరూపించుకున్న సంజూ శాంసన్‌ను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదని శశిథరూర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ‘పాపం.. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్ అయి ప్రపంచంలోనే చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అయితే, ఇంతకుముందు తానెప్పుడూ ఆడని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా 66 సగటుతో ఉన్న సంజూ శాంసన్‌ని ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదు? అతను ఇంకేం చేయాలి?’అని శశిథరూర్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. సూర్యకుమార్ యాదవ్‌ను సంజూ శాంసన్‌తో పోల్చవద్దని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిమానులను కోరారు.‘ఎవరు బాగా ఆడితే వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. సూర్యకుమార్ యాదవ్‌ని సంజూ శాంసన్‌తో పోల్చకండి. అది సరైనది కాదు. సంజూ బ్యాడ్‌ఫేజ్‌లో ఉంటే మీరు మరొకరి గురించి మాట్లాడతారు. ఇది జరగకూడదు. ఒకవేళ టీమ్ మేనేజ్మెంట్ సూర్యకుమార్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎవరి అభిప్రాయం వారు చెబుతారు. చివరికి టీమ్ మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని కపిల్ దేవ్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!