Ayodhya: ఇది చరిత్రాత్మక ఘట్టం.. రామ్‌లల్లా ఆశీర్వాదం కోసం రావడం అనిర్వచనీయం: క్రీడా ప్రముఖులు

ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమవుతూ అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వైభవంగా కొనసాగుతోంది. దీనికి పలువురు క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. 

Updated : 22 Jan 2024 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అయోధ్యకు క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో అక్కడి ప్రాంగణం మార్మోగుతోంది. క్రికెటర్లు సచిన్‌, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, మిథాలీరాజ్‌, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ తదితరులు హాజరయ్యారు.

‘‘అద్భుతమైన ఘట్టం. చారిత్రక సందర్భం. రామ్‌లల్లా ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాం’’ - అనిల్‌ కుంబ్లే

‘‘మనకు గొప్ప రోజు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. మాటల్లో చెప్పలేని ఆనందంతో ఉన్నా. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని సందర్శించాలని కోరుతున్నా’’ - సైనా నెహ్వాల్

‘‘ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. చాలా రోజుల నుంచి మనం కోరుకుంటున్నదిదే. ఇక్కడికి ఆహ్వానం రావడం జీవితంలో మరిచిపోలేను. ఈ వేడుక నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇందులో భాగం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ - మిథాలీ రాజ్‌ 

‘‘మహాద్భుతాన్ని తిలకించడం ఆనందంగా ఉంది. ఒకే నామం జై శ్రీరామ్‌..’’ - వెంకటేశ్ ప్రసాద్‌

‘‘నేను భావోద్వేగానికి గురయ్యా. ఆనందంతో పరవశించా. మాటలు రావడం లేదు. శ్రీరామచంద్ర ప్రభుకి సదా రుణపడి ఉంటా. ఇలాంటి అపూర్వ రోజు కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్‌..’’ - వీరేంద్ర సెహ్వాగ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని