IND vs SA: టీమ్‌ఇండియాకు బంగారు అవకాశం: హర్భజన్‌

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియాకు బంగారు అవకాశం ఉందని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. మరికొద్ది రోజుల్లో భారత జట్టు అక్కడికెళ్లి మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న...

Updated : 09 Dec 2021 10:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియాకు బంగారు అవకాశం ఉందని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. మరికొద్ది రోజుల్లో భారత జట్టు అక్కడికెళ్లి మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న నేపథ్యంలో స్పిన్‌ దిగ్గజం యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇప్పటివరకు టీమ్‌ఇండియా ఆ దేశంలో ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదని.. ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నాడు. ప్రస్తుతం ఆ జట్టులో ఆటగాళ్లెవరూ మంచి ఫామ్‌లో లేరని, దీంతో అక్కడ విజయాలు సాధించి చరిత్ర సృష్టించాలని భజ్జీ అశాభావం వ్యక్తం చేశాడు.

‘టీమ్‌ఇండియాకు ఇది బంగారు అవకాశం. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు ఇంతకుముందులా పటిష్ఠంగా లేదు. గత పర్యటనలోనూ ఏబీ డివిలియర్స్, ఫాడుప్లెసిస్‌ లాంటి ఆటగాళ్లు టీమ్‌ఇండియాను సిరీస్‌ గెలవకుండా అడ్డుకున్నారు. అక్కడ భారత జట్టు పలుమార్లు మంచి ప్రదర్శన చేసినా ఎప్పుడూ సిరీస్‌ నెగ్గలేదు. అక్కడ చరిత్ర సృష్టించడానికి ఇదే మంచి అవకాశం’ అని హర్భజన్‌ అన్నాడు. కాగా, తొలుత ఈ పర్యటన ఈనెల 17 నుంచే ప్రారంభంకావాల్సి ఉండగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ నేపథ్యంలో వారం రోజులు వాయిదా పడింది. దీంతో ఈనెల 26 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. అయితే తర్వాత జరగాల్సిన నాలుగు టీ20ల సిరీస్‌ను బీసీసీఐ ప్రస్తుతానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని