Updated : 16 Oct 2021 12:50 IST

IPL 2021: దురదృష్టం కొద్దీ మ్యాచ్‌లో ఓడిపోయాం: మోర్గాన్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఫైనల్లో ఓటమిపాలైనా తమ ఆటగాళ్ల అంకితభావం, పట్టుదల చూసి గర్వంగా ఉందని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. దురదృష్టం కొద్దీ ఈరోజు(అక్టోబర్‌ 15) తమది కాదన్నాడు. ఐపీఎల్‌ వెంకటేశ్‌ అయ్యర్‌కు కొత్త వేదిక అని, అతడికి మంచి భవిష్యత్తు ఉందని కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. అతడు, శుభ్‌మన్‌ గిల్‌ తమ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌కు మూలస్తంభాలని మెచ్చుకున్నాడు. అలాగే దిల్లీతో జరిగిన క్వాలిఫయర్‌-2లో చివర్లో సిక్సర్‌ కొట్టి గెలిపించిన రాహుల్‌ త్రిపాఠిని ప్రశంసించాడు. అతడి శక్తిసామర్థ్యాలు అద్భుతమని కొనియాడాడు.

గతరాత్రి జరిగిన తుదిపోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 27 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 165/9కే పరిమితమైంది. దీంతో ఐపీఎల్ ఫైనల్లో తొలిసారి కప్పు సాధించకుండానే వెనుదిరిగింది. కోల్‌కతా ఇదివరకు 2012, 2014 సీజన్లలో ఫైనల్‌ చేరగా రెండుసార్లూ కప్పును ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌ (50), శుభ్‌మన్‌గిల్‌ (51) అర్ధశతకాలతో గొప్ప శుభారంభం చేసినా తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో ఫెర్గూసన్‌ (18), శివమ్‌ మావి (20) బ్యాట్లు ఝుళిపించినా అప్పటికే కోల్‌కతా ఓటమి ఖాయమైంది. ఈ క్రమంలోనే చెన్నై 2012 ఫైనల్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

మరోవైపు కోల్‌కతా ఈ సీజన్‌ తొలి దశలో పేలవంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. అయితే, యూఏఈకి వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకుంది. టాప్ఆర్డర్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌తో పాటు రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా రాణించడంతో కోల్‌కతా వరుస విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, షకిబ్‌ అల్‌ హసన్‌ సైతం బౌలింగ్‌లో మెరిశారు. ప్రత్యర్థులను వీలైనంత తక్కువ స్కోర్లకు కట్టడి చేశారు. దీంతో ఆఖరి నిమిషంలో అనూహ్యంగా ప్లేఆఫ్స్‌ చేరిన మోర్గాన్‌ టీమ్‌ ఇక్కడ బెంగళూరు, దిల్లీ జట్లను ఓడించింది. అలా ఫైనల్‌కు చేరి చెన్నై చేతిలో ఓటమిపాలైంది. ఒక దశలో ప్లేఆఫ్స్‌కైనా చేరుకుంటుందా అని అనుకున్న కోల్‌కతా ఇలా రన్నరప్‌గా నిలిచిందంటే గొప్ప విశేషమే.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని