Afghan Cricketer: ‘సెంచరీల కంటే గొప్ప ఘనత’: అఫ్గాన్‌ క్రికెటర్‌పై థరూర్‌ ప్రశంసలు

అఫ్గాన్ యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ (Rahmanullah Gurbaz) వీధుల్లోని నిరాశ్రయులకు తనవంతు ఆర్థిక సాయం అందించడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

Published : 13 Nov 2023 17:13 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ (Afghanistan) క్రికెటర్ రహ్మనుల్లా గుర్బాజ్‌(Rahmanullah Gurbaz) నిరాశ్రయుల పట్ల చూపిన కరుణ అందరినీ మెప్పిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల సమయంలో అహ్మదాబాద్‌లోని వీధుల్లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారికి గుర్బాజ్‌ తనవంతు సాయం చేశాడు. వైరల్‌గా మారిన ఆ దృశ్యంపై కాంగ్రెస్‌ సీనియర్ నేత శశిథరూర్‌(Shashi Tharoor) నెట్టింట్లో స్పందించారు. అతడిపై ప్రశంసలు కురిపించారు.

అఫ్గాన్‌ క్రికెట్‌కు ఉందిలే మంచి కాలం.. ప్రపంచకప్‌ ప్రదర్శనతో భవిష్యత్‌పై ఆశలు

‘చివరి మ్యాచ్‌ అనంతరం అఫ్గాన్‌ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ (Rahmanullah Gurbaz).. నిరాశ్రయుల పట్ల చూపిన కరుణ అద్భుతం. అతడు సాధించిన శతకాల కంటే కూడా ఇది చాలా గొప్ప విషయం. అతడు  ఇంకా ఎన్నో విజయాలు సాధించగలడు. ఈ మంచి మనస్సు, కెరీర్‌ చిరకాలం వర్ధిల్లాలి’ అని థరూర్ ట్వీట్ చేశారు. ఈ వీడియోను  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘గత నెలలో అఫ్గాన్‌లో భారీ భూకంపం వల్ల నష్టపోయిన అభాగ్యుల కోసం ఫండ్‌ రైజ్‌ చేసి అందించిన క్రికెటర్ గుర్బాజ్‌ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. వరల్డ్‌ కప్‌ అనంతరం స్వదేశానికి వెళ్లిపోయే ముందు దీపావళి సందర్భంగా గుర్బాజ్‌ ఇలా సర్‌ప్రైజ్‌ చేశాడు’ అని వ్యాఖ్యను జోడించింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున గుర్బాజ్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని