Yuzvendra Chahal : అతడి సలహాతోనే మెరుగ్గా రాణించగల్గుతున్నాను: చాహల్

న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు డేవియల్ వెటోరీ ఇచ్చిన సలహాతోనే ఇన్నాళ్లు మెరుగ్గా రాణించగలుగుతున్నానని లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ పేర్కొన్నాడు. ఇటీవల సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌..

Published : 02 Feb 2022 11:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు డేవియల్ వెటోరీ ఇచ్చిన సలహాతోనే ఇన్నాళ్లు మెరుగ్గా రాణించగలుగుతున్నానని లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ పేర్కొన్నాడు. ఇటీవల సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు పలు విషయాలను వెల్లడించాడు.

‘2014లో నేను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఎంపికైన సమయంలో న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు డేనియల్ వెటోరీ హెడ్‌ కోచ్‌గా ఉండేవాడు. నేను నాణ్యమైన స్పిన్నర్‌గా ఎదిగేందుకు అతడు చాలా సహకారం అందించాడు. ఒక బౌలర్‌గా, అనుభవమున్న క్రికెటర్‌గా నాకు చాలా సలహాలు చెప్పాడు. నా బౌలింగ్‌ యాక్షన్‌ మార్చుకోకుండా బంతిని ఎలా వేయాలనే విషయంపై కొన్ని సూచనలు చేశాడు. నాతో నెట్స్‌లో అదనపు ఓవర్లు బౌలింగ్‌ చేయించేవాడు. నేను మరింత మెరుగయ్యేందుకు అది ఉపయోగపడింది. 3-4 మ్యాచులు ఆడిన తర్వాత నేను బౌలింగ్‌ చేసిన వీడియోలను పంపేవాడు. ఏమైనా మార్పులు ఉంటే చెప్పేవాడు’ అని చాహల్ పేర్కొన్నాడు.

‘ఐపీఎల్‌లో 14 మ్యాచులుంటాయి. అందులో 3, 4 మ్యాచుల్లో విఫలమైనా, మిగతా మ్యాచుల్లో మాత్రం కచ్చితంగా మెరుగ్గా రాణించాలి. ఎకానమీ కూడా 7 లోపే ఉండేలా చూసుకోవాలి. మణికట్టుతో మ్యాజిక్‌ చేయాలి. బంతిని రిలీజ్‌ చేసే సమయంలో మణికట్టు స్థానాన్ని మార్చి.. ప్రత్యర్థి బ్యాటర్‌ని తికమక పెట్టాలని చెప్పేవాడు. ఇప్పటికీ నేను ఇదే విషయాన్ని అనుసరిస్తున్నాను’ అని యుజ్వేంద్ర చాహల్ చెప్పాడు. ఐపీఎల్‌లో చాహల్‌ ఆర్‌సీబీ జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని